రాష్ట్రీయం

జూనియర్ సివిల్ జడ్జీల నియామకానికి మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: జూనియర్ సివిల్ జడ్జీల నియామకానికి 2014లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఎంపికైన అభ్యర్థుల నియామకానికి హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి మరో ఇద్దరు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బోసలె, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, జ్యుడీషియల్ నిబంధనలు వచ్చినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా నియామకాలు తగవని పిటిషనర్లు చేసిన వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. జ్యుడీషియల్ నిబంధనలు తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించలేదని న్యాయమూర్తులు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో హైకోర్టు ఈ నియామకాలను నిర్వహించిందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.