ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి దారేదంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రహదారుల చక్రబంధంలో ఇరుక్కోనుంది. అందుబాటులో జాతీయ రహదారులు ఉన్నప్పటికీ అనాలోచిత నిర్ణయాల కారణంగా వందల కోట్ల రూపాయల వృథా ఖర్చుతోపాటు భవిష్యత్తు ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిణమించే నిర్ణయాలతో డిజైన్లు రూపొందిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ప్రాంత, నగర, సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లను సింగపూర్ సర్బానో జురాంగ సంస్థ అందించింది. సీడ్ కేపిటల్‌లో కీలకమైన శాసనసభ, సచివాలయం, రాజ్‌భవన్‌కు అంతర్గతంగా మేజర్, మైనర్ ఆర్టీరియల్ రోడ్లతోపాటు ఆరు రహదార్లకు ఇప్పటికే డిజైన్లు రూపొందించారు. కాగా రాజధాని ముఖద్వారం కృష్ణానది వద్ద ఐకాన్ టవర్లు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో గొల్లపూడి వెంకటపాలెం వద్ద నిర్మించే వంతెనకు దగ్గరలో ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే గత కొద్దిరోజుల క్రితం కనకదుర్గమ్మ వారధి నుంచి ఆరు ఫ్లైఓవర్లు, స్ప్రింగ్ వంతెనలతో సీడ్ కేపిటల్‌కు నేరుగా ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.569 కోట్ల ప్రతిపాదనలతో రెండు దశలలో 21.35 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు తీసుకొచ్చారు. ఈ హైవేను జాతీయ రహదారి 16, 65లతో కనకదుర్గమ్మ వారధి వద్ద అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. అయితే చెన్నై-కోల్‌కత మార్గంలో 16వ నెంబరు జాతీయ రహదారిలో కనకదుర్గమ్మ వారధి వద్ద నిత్యం వాహనాల రాకపోకల రద్దీ ఉంటుంది. దీనికితోడు ముంబయి- హైదరాబాద్ జాతీయ రహదారి నెం. 65లో కూడా విజయవాడ నుంచి చెన్నై వెళ్లాలంటే వారధి మీదుగానే చేరుకోవాలి. ఈ నేపథ్యంలో అదనంగా రాజధాని రవాణా వ్యవస్థకోసం వారధి సమీపంలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి 21 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తే వారధి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రవాణారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 ప్రామాణికంగా సింగపూర్ మాస్టర్‌ప్లాన్ అందించింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వారధి మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గడువు తీరిపోవడంతో వారధి పైనుంచే రవాణా జరుగుతోంది. అయితే ప్రకాశం బ్యారేజీ ప్రమాణాలకు తగ్గట్టుగా వారధి నిర్మాణం జరగలేదు. ఈ పరిస్థితుల్లో అదనపు తాకిడివల్ల వారధి దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. చెన్నై, హైదరాబాద్, గన్నవరం నుంచి వచ్చే వాహనాల కారణంగా పెద్దఎత్తున ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుంది. విజయవాడ- మంగళగిరి ఎన్నారై వరకు బైపాస్ రోడ్డు పూర్తయితే గొల్లపూడి సమీపంలోని వెంకటపాలెం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారు. దీనివల్ల జాతీయ రహదారి 65 నుంచి నేరుగా సీడ్ కేపిటల్‌కు మార్గం సుగమమవుతుంది. వారధిపై ఒత్తిడి కూడా ఉండదని వాదనలు వినవస్తున్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డును ఇబ్రహీంపట్నం- గన్నవరం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి వరకు 47 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అన్నిరకాల అనుమతులు, భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపులు కూడా జరిగాయి. ఇందుకోసం 600 ఎకరాల మేర భూ సేకరణ జరిపి రైతులకు నష్టపరిహారం చెల్లించారు. రూ. 1600 కోట్ల అంచనాతో అప్పట్లో చిన్నవుటుపల్లి, బీబీగూడెం, గన్నవరం స్టేషన్ నుంచి నూజివీడు రోడ్డులో పోలవరం కాల్వ సమీపం నుంచి బుడమేరు కాల్వ, గొల్లపూడి, సూరాయపాలెం- వెంకటపాలెం- కృష్ణాయపాలెం నుంచి ఎన్నారై కళాశాల వరకు నిర్మించాల్సి ఉంది. గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్టు కూడా పొందింది. సుమారు 6వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. అయితే టోల్ ఫీజు విషయంలో కాంట్రాక్టు సంస్థ.. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరక పనులు నిలిపివేశారు. భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులు పూర్తయినా బైపాస్‌కు గ్రహణం పట్టడంతో కొత్త ప్రతిపాదనలు.. అంచనాలు తెరపైకి వస్తున్నాయి.. ఆర్థికలోటు ఉన్న నేపథ్యంలో బైపాస్ పనులు చేపడితే సీడ్ కేపిటల్ రవాణాకు అదనపు ఖర్చు అవసరం ఉండదనేది కొందరు అధికారుల వాదన.