ఆంధ్రప్రదేశ్‌

విశాఖ కేంద్రంగా హెల్త్ టూరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని, అందుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ హెల్త్‌సిటీలో అపోలో గ్రూప్ రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన 250 పడకల ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో వైద్యానికిత్సల ఖర్చు తక్కువగా ఉంటోందన్నారు. ప్రతి యేటా 20 శాతం మంది విదేశీయులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే విదేశాల నుంచి వైద్యం నిమిత్తం వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. విశాఖకు అతి సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని, అది పూర్తయితే విదేశాలకు కనెక్ష్టివిటీ పెరుగుతుందని, తద్వారా విదేశీయుల రాకకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. విశాఖ హెల్త్‌సిటీలో 28 ఆసుపత్రులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 15 ఆసుపత్రులు నిర్మాణం పూర్తిచేసుకుని, వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాయన్నారు. మిగిలిన ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలని, లేకుంటే కేటాయించిన భూములు వెనక్కు తీసుకుని కొత్తవారికి అప్పగిస్తామన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, పర్యాటకరంగాల్లో విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని అన్నారు. అపోలో సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రిని నిర్మించామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సేవలతో 24 గంటలు వైద్య నిపుణులు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. భవిష్యత్‌లో 100 పడకలతో కేన్సర్ చికిత్స విభాగాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. అపోలో ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్ సంగీతారెడ్డి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం... విశాఖలో శనివారం అపోలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతున్న అపోలో సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి