ఆంధ్రప్రదేశ్‌

నదీ జలాలపై ప్రత్యేక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీ, వినియోగానికి కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల సిఎంలతో కూడిన అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అపెక్స్‌బాడీ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు. గతంలో మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు జరిగాయని, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో చివరి రాష్ట్రానికి అన్యాయం జరక్కుండా దామాషా ప్రకారం నీటి పంపకాలు చేపట్టాలన్నారు. ఎగువనున్న రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులతో కింది రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోతోందని, తద్వారా చివరి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల నీటిని మూడు రాష్ట్రాలకు కాకుండా నాలుగు రాష్ట్రాలకు పంచాలని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎగువ రాష్ట్రాలు నీటి విడుదలను అడ్డుకుంటున్నాయన్నారు. వరదలు సంభవించినప్పుడు మాత్రం కింది రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తున్నాయని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఏటా కృష్ణాబేసిన్ నుంచి 800 నుంచి 1200 టిఎంసిల నీరు తెలుగు రాష్ట్రాలకు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 70 టిఎంసిల నీరు మాత్రమే వచ్చిందన్నారు.
అశాస్ర్తియంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని బాబు అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక, హోం, ఇతర శాఖల మంత్రులను కలిసి తమ వాదనలు వినిపించామన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రధాని మోదీ, కేంద్రానికి లేఖ రాయనున్నట్టు బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ఈ తరుణంలో ప్రత్యేక హోదా అవసరం లేదని ఇటీవల ఓ కేంద్రమంత్రి వ్యాఖ్యానించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించేంత వరకూ కేంద్రం తప్పనిసరిగా సాయం అందించాల్సిందేనని పునరుద్ఘాటించారు. అలాగే పరిశ్రమలకు రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఆర్థికలోటుతో సతమతమవుతున్నది ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్న వాస్తవాన్ని కేంద్రం గుర్తెరిగి పెద్దమనసుతో సాయం అందించాలని కోరారు.

చిత్రం... విశాఖలో నిర్వహించిన నీరు-ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతున్న బాబు