తెలంగాణ

మళ్లీ.. మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30 : వ్యవసాయం, రవాణా, ఎక్సైజ్ శాఖల్లో 1477 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టులు 1000, రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులన్నింటికీ 2016 మే 4 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి ప్రకటించారు. ఎఇఓ పోస్టులకు మే 19 వరకు, రవాణా, ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు మే 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఎఇఓ పోస్టులకు 2016 జూన్ 4న పరీక్ష ఉంటుందని, కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలను తర్వాత ప్రకటిస్తామని టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి నోటిఫికేషన్‌లో వివరించారు.