తెలంగాణ

తెరాసలోకి పొంగులేటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రధాన అనుచర వర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గత కొద్ది రోజులుగా ఎంపితో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇతర ప్రధాన నేతలు అధికార పార్టీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సోమవారం ఉదయం పొంగులేటికే చెందిన ఫంక్షన్ హాలులో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ నేతలకు కూడా సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానాలు అందించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మినహా మరే జిల్లాలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవటం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ జిల్లాలోనే ఒక ఎంపితో పాటు, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా పొంగులేటికి ప్రధాన అనుచరుడిగా ఉన్న సాధు రమేష్‌రెడ్డి కూడా కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత మూడు రోజుల క్రితం సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మట్టా దయానంద్‌తో పాటు పలువురు నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గంట సేపు రహస్య సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమావేశంలో ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తుమ్మలకు అనుచరుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల ఆహ్వానం మేరకే టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. సమావేశం అనంతరం నేరుగా హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి