ఆంధ్రప్రదేశ్‌

హోదాకోసం ఢిల్లీకి అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, కేంద్రం నుంచి నిధులు లభిస్తాయని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పోరాటానికి తాము వెంట వస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రం వద్ద ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చేస్తున్నదని, రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైందని లోగడ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు అన్నారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తమ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రస్తావించినందుకే కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని ఆయన చెప్పారు. టిడిపి ఎంపీలు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పథకం సాధించలేదని, పైగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని పక్కన పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రన్న బీమా వంటి పథకాలకు పేర్లు పెట్టడం చూస్తుంటే సైకో ప్యాన్సీ వచ్చినట్లు కనిపిస్తున్నదని ఆయన తెలిపారు.