రాష్ట్రీయం

న్యాయాధికారుల పంపకం పూర్తి మే 13వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయాధికారులను 52:48 ప్రకారం కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు న్యాయాధికారుల నుంచి ఆప్షన్లను రిజిస్ట్రీ ఆహ్వానించింది. 335 జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, 28 మంది రిటైర్డు న్యాయాధికారులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. 492 మంది వరకు జిల్లా జడ్జిల హోదాలో ఉన్న 492 మంది జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, 34 మంది రిటైర్డు జ్యుడీషియల్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. న్యాయాధికారుల కేటాయింపును హైకోర్టు ప్రచురించింది. అనంతరం అభ్యంతరాలను జిల్లా జడ్జికి మే 13వ తేదీలోగా ఇవ్వాలని, ఈ అభ్యంతరాలను హైకోర్టుకు మే 18వ తేదీలోగా పంపాలని హైకోర్టు ఆదేశించింది. ఆఫ్షన్లను సమర్పించిన న్యాయాధికారులను వారి సర్వీసు రికార్డుల ప్రకారం స్థానికతను ప్రాతిపదికగా తీసుకుని కేటాయించారు.