జాతీయ వార్తలు

విభజన చట్టంలోని మూడు విభాగాలను సవరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 3: ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తున్న విభజన చట్టంలోని మూడు విభాగాలను సవరించాలని తెలుగుదేశం సభ్యుడు గళ్లా జయదేవ్ డిమాండ్ చేశారు. గళ్లా జయదేవ్ మంగళవారం లోకసభ జీలో అవర్‌లో మాట్లాడవుతూ ఏ.పి.విభజన చట్టంలోని 50, 51, 56 విభాగాలు పరస్పర వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నాయి, దీని మూలంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణాకు ఆస్తులు, అప్పులు సమంగా పంపిణీ చేయాలంటే ఓకే రకమైన కొలబద్దను ఉపయోగించవలసి అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులపై పన్నులు, ఇర డ్యూటీలు, భూమి ఆదాయం బకాయిలను వసూలు చేసుకునే అధికారం సదరు ఆస్తులు ఉన్న రాష్ట్రానికే ఉంటుందని విభజన చట్టంలోని 50 విభాగం చెబుతోందన్నారు. ఇదే విధంగా ఇతర పన్నులు, డ్యూటీల బకాయిలను కూడా వసూలు చేసుకునే అధికారం సదరు ఆస్తులు, లేదా పన్ను నిర్దారించే ప్రాంతం ఉన్న సక్ససర్ రాష్ట్రానికి ఉంటుందనేది ఈ విభాగం స్పష్టం చేస్తోందని గళ్లా జయదేవ్ చెప్పారు. దీనితోపాటు అప్పాయింటెడ్ తేదీకి ముందు వసూలు చేసిన రుణాలు లేదా నగదు చెల్లింపుల చేసి ఉంటే వీటిని రెండు రాష్ట్రాల జనాభా ఆధారంగా పంచుకోవాలని 51 సెక్షన్ చెబుతోందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తులపై విధించిన పన్నులు, డల్యూటీలను వాపసు చేయవలసి వస్తే దీనిని జనాభా ప్రాతిపదికపై చేయాలని 56వ సెక్షన్ సూచిస్తోందంటూ ఈ సెక్షన్లు పరస్పర విరుద్దంగా ఉన్నాయని జయదేవ్ తెలిపారు.
పన్నులు,డ్యూటీలకు సంబంధించిన చెల్లింపులను జనాభా ప్రాతిపదిక లేదా ప్రాంతాల ప్రాతిపదికపై ఉండాలి తప్ప ఒక చోట జనాభా ప్రాతిపదిక, మరో చోట ప్రాంతాల ప్రాతిపదికపై చేయాలన విభజన చట్టంలో సూచించటం వలన సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన వాదించారు. భిన్న రకాల కొలబద్దలను ఉపయోగించటం వలన ఆంధ్రప్రదేశ్‌కు 3,800 కోట్ల నష్టం వాటిల్లుతోందని జయదేవ్ తెలిపారు. తెలంగాణాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా అధికం కాబట్టి ఆంధ్ర ప్రదేశ్‌పై ఎక్కువ అప్పుల భారం పడుతోందని గళ్లా జయదేవ్ చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏ.పి.విభజన చట్టంలోని 50,51,56 సెక్షన్‌లను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితో పాటు 9వ షెడ్యూలులోని సంస్థల విభజన జనాభా ప్రాతిపదికపై జరగాలని ఆయన స్పష్టం చేశారు.