రాష్ట్రీయం

25 మంది ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: ఆంధ్రప్రదేశ్‌లో 25 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. మరో ఐదుగురిని డిజిపికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఎ ఆర్ అనురాధను ప్రభుత్వం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆమె విజిలెన్స్ విభాగానికి పూర్తి అదనపు బాధ్యతలు సైతం నిర్వహించనున్నారు. వైజాగ్ పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్‌ను బదిలీ చేసి పి అండ్ ఎల్ ఐజిపిగా బదిలీ చేశారు. ఇంటిలిజెన్స్ డిఐజి టి యోగానంద్‌కు పదోన్నతి కల్పించి వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్‌గా నియమించారు. ఐజిపిగా వ్యవహరిస్తున్న ఎన్ శ్రీ్ధర్‌రావును సౌత్‌జోన్ ఐజిపిగా నియమించారు. సౌత్‌జోన్ ఐజిపి వి వేణుగోపాలకృష్ణను పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ ఐజిపిగా నియమించారు. విజయవాడ అదనపు సిపి మహేష్ చంద్ర లడ్డాను ఇంటిలిజెన్స్ ఐజిపిగా నియమించారు. అనంతపురం రేంజ్ డిఐజి కె సత్యనారాయణకు పదోన్నతి కల్పించి సిఐడి ఐజిపిగా నియమించారు. ఎస్‌ఐబి డిఐజి బి శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి ఎస్‌ఐబి ఐజిపిగా నియమించారు. డిఐజి లీగల్‌గా ఉన్న ఇ.దామోదర్‌ను పదోన్నతి కల్పించి ఐజిపి లీగల్‌గా కొనసాగిస్తున్నారు. సిఐడి డిఐజి ఎ.సుందర్ కుమార్ దాస్‌ను లీగల్ మెట్రాలజీ డైరెక్టర్‌గా నియమించారు. విశాఖ రేంజ్ డిఐజి ఎ.రవిచంద్రను పదోన్నతి కల్పించి ఐజిపి ట్రైనింగ్ -2గా నియమించారు. డిఐజి సెక్యూరిటీగా ఉన్న పివిఎస్ రామకృష్ణను ఏలూరు రేంజ్ డిఐజిగా నియమించారు. అ3క్కడ పనిచేస్తున్న పి హరికుమార్‌ను విజయవాడ నగరం జాయింట్ సిపిగా నియమించారు. జె.ప్రభాకరరావుకు పదోన్నతి కల్పించి అనంతపురం డిఐజిగా నియమించారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్‌కు పదోన్నతి కల్పించి విశాఖపట్టణం రేంజ్ డిఐజిగా నియమించారు. శ్రీకాకుళం ఎస్పీ ఎ ఎస్ ఖాన్‌కు పదోన్నతి కల్పించి విశాఖ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ జె సత్యనారాయణకు పదోన్నతి కల్పించి డిఐజి సెక్యూరిటీగా నియమించారు. సిఐడి ఎస్పీ జె బ్రహ్మారెడ్డిని శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు. విశాఖపట్టణం డిసిపి డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మను ప్రకాశం ఎస్పీగా నియమించారు. సిఐడి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను విశాఖ రూరల్ ఎస్పీగా నియమించారు. ఎపిఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న బి రాజకుమారిని రాజమండ్రి అర్బన్ ఎస్పీగా నియమించారు. విజయవాడ డిసిపి లా అండ్ ఆర్డర్‌గా వ్యవహరిస్తున్న ఎల్ కె వి రంగారావును విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణను కడప ఎస్పీగా నియమించారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ ఆర్ జయలక్ష్మిని తిరుపతి అర్బన్ ఎస్పీగా నియమించారు.
డిజిపికి సరెండర్
ఐదుగురు ఐపిఎస్ అధికారులను డిజిపికి రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అందులో జివి దీప్ సింగ్, డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్ హరికృష్ణ, డాక్టర్ నవీన్ గులాటి, గోపినాధ్ జెట్టి ఉన్నారు. వీరికి ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు తెలిసింది.