తెలంగాణ

విల్లంబులతో గిరిజనుడి వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/చింతూరు, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం వేగితోట గ్రామంలో విల్లంబు, బాణాలు చేతబూనిన గిరిజనుడు భీతావహ వాతావరణం సృష్టించాడు. బుధవారం ఉదయం మతిస్థిమితం లేని ఒక వ్యక్తి విల్లు, అంబులతో వీరంగం సృష్టించాడు. మిడియం ముత్తయ్య బాణాలతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. వివరాలిలావున్నాయి... గ్రామానికి చెందిన మిడియం ముత్తయ్య బుధవారం తెల్లవారుజామున ఇంటిముందు చలిమంట కాగుతున్న కారం దారయ్యపై వెనక నుండి బాణం సంధించాడు. ఈ బాణం దారయ్య కిడ్నీలోకి దూసుకుపోయింది.
అనంతరం అదే గ్రామానికి చెందిన తుర్రం లాలమ్మపై బాణం సంధించడంతో ఆమె వెనుకభాగంలోకి దూసుకుపోయింది. అనంతరం గ్రామంలో కొద్దిసేపు హల్‌చల్ సృష్టించాడు. క్షతగాత్రులను గ్రామస్థులు చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ బాణాలు వారి శరీరభాగాల నుండి తీయడం వీలు కాకపోవడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దారయ్య పరిస్థితి విషమంగా ఉంది. చింతూరు ఎస్సై గజేంద్రకుమార్ ముత్తయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాణం దూసుకెళ్లిన దారయ్య
వెనుకభాగంలో బాణం తగిలిన లాలమ్మ
నిందితుడు ముత్తయ్య