రాష్ట్రీయం

భావనపాడుకు భలే ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 5: భావనపాడు పోర్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టు నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద రైల్వే కార్గో లైన్ ఏర్పాటు ద్వారా భావనపాడు నుంచి సరుకుల రవాణా మరింత సులభమవుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం ఉదయం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ భావనపాడు పోర్టు పూర్తయితే రాయ్‌పూర్ వద్ద కార్గోరైల్వే లైన్ ఏర్పాటు ద్వారా భావనపాడు నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి తదితర ప్రాంతాలకు నేరుగా సరుకులు రవాణా చేయవచ్చన్నారు. ఈ పనులు ప్రారంభించాలంటే మరో మూడు మాసాల్లో ల్యాండ్ పూలింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు నిర్వాసితులు సహకరించాలన్నారు. అమరావతి ప్యాకేజీ కంటే ఎక్కువగా ఇచ్చేందుకు పరిశీలిస్తామని చెప్పారు. భావనపాడు పోర్టుకు విశాఖపట్నం పోర్టు కంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్గో రైల్వే రవాణా పరంగా రాయపూర్ వద్ద అనుసంధానం చేస్తూ ట్రాక్ వేయడం వల్ల విజయవాడ కన్నా మెరుగైన కూడలిగా మారుతుందని తెలిపారు. భావనపాడు నిర్వాసితులకు అన్యాయం జరగదని బాబు భరోసా ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుణ్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

chitram అరసవెల్లి శ్రీసూర్యనారాయణస్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు