రాష్ట్రీయం

పది కాదు.. పాతిక !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5:తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు తెరలేచింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లా ల సంఖ్యను 24 లేదా 25కు, మండలాల సంఖ్యను మరో 40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలను పునర్వ్యవస్థీకరించనున్నట్టు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు మరో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన చేస్తారు. ఆగస్టు 15 నుంచి లేదా దసరా రోజు నుంచి కొత్త జిల్లాల నుండే అధికారిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. కొత్తవి, పాతవి కలిపి తెలంగాణలో 24 నుంచి 25 జిల్లాలు ఉంటాయి. వీటికి అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఆయా శాఖల అధికారులను పంచనున్నారు. దీనిలో భాగంగా ప్రతి ఎనిమిది నుండి పది మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాల సంఖ్య పెంపుదలవల్ల కలిగే పరిపాలనా సౌలభ్యం, ప్రజాప్రయోజనాలను లోతుగా సమీక్షించారు. కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో అందే గ్రాంట్లు, నెలకొల్పే విద్యాలయాలు, కేంద్రం విడుదల చేసే నిధులు, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను యూనిట్‌గా తీసుకుని జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.
జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి అందే ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో పొందవచ్చునని తెలిపారు. ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. రెవెన్యూ, న్యాయ, మున్సిపాలిటీ, విద్యా, వైద్యం తదితర నిత్య ప్రజా సంబంధాలు ఉండే ముఖ్య కార్యాలయాలు అన్నీ జిల్లా కేంద్రాల్లో కేంద్రీకృతం అయి ఉండడం మూలాన మారుమూల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ నగరం దిన దినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రీకృతం అవుతున్న అభివృద్ధిని తెలంగాణవ్యాప్తంగా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కన్నా తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభా కలిగిన పలు రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ సంఖ్యలో జిల్లాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్ర్తియ పద్ధతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలు పెరిగితే యుతవకు విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని అన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచుతున్నట్టు చెప్పారు. కాగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా కలెక్టర్, ఎస్పీ, అధికార కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి రోజూ అందుబాటులో ఉండాల్సిన రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం అంతా కలెక్టర్ కార్యాలయంలో కేంద్రీకృతం అయితే బాగుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ నివేదిక ఏమైంది?
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏడాది క్రితం కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ముఖ్యమంత్రి హఠాత్తుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం విశేషం.

chitram గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం