రాష్ట్రీయం

తలనీలాలు విక్రయం ద్వారా 7.96 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 5: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు సమర్పించిన తలనీలాల ఈ-వేలం ద్వారా టిటిడికి రూ.7.96 కోట్లు ఆదాయం లభించింది. గురువారం తలనీలాల్లో మొదటి రకం 2700 కిలోలను కిలో రూ.25,563 గా నిర్ణయించి ఈవేలంలో ఉంచగా ఏవీ అమ్ముడు పోలేదు. అయితే కిలో రూ.19,042 గా ఉన్న రెండో రకం 27,600 కిలోల తలనీలాలను ఈవేలంలో ఉంచగా ఇందులో 3,600 కిలోలు అమ్ముడుపోయి రూ.685.58 లక్షలు ఆదాయం లభించింది.కిలో రూ.4,313గా ఉన్న మూడో రకం తలనీలాలు 70,500 కిలోలను వేలానికి ఉంచగా ఇందులో 2,500కిలోలు అమ్ముడుపోయి రూ.107.83 ఆదాయం లభించింది. ఇక కిలో రూ.3,583గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 13,200 కిలోలను వేలానికి ఉంచగా ఇది అమ్ముడు పోలేదు. కిలో రూ.31గా ఉన్న ఐదోరకం తలనీలాలను 10వేల కిలోలను వేలంలో అమ్మకానికి ఉంచగా ఇందులో 9వేల కిలోలు అమ్ముడుపోగా, రూ.2.79 లక్షల ఆదాయం వచ్చింది. కిలో రూ.6,706గా ఉన్న తెల్ల వెంట్రుకలను 2,100 కిలోలను అమ్మకానికి ఉంచినా అమ్ముడు పోలేదు.