రాష్ట్రీయం

ఉద్యోగ విభజన ఆగస్టుకు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం ఆగుస్టునాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సర్వీసుల సలహా కమిటీ చైర్మన్ సిఆర్ కమలనాథన్ నేతృత్వంలో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్‌లతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి మొత్తం 153 యూనిట్లు (శాఖలు, ఉపశాఖలు) ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 142 యూనిట్ల ఉద్యోగులకు సంబంధించిన విభజన జరిగినట్టు కమలనాథన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో 11 యూనిట్లు మాత్రమే మిగిలాయి. 2016 ఆగస్టులోగా ఈ యూనిట్ల ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయని, చిన్న చిన్న అంశాలు ఉంటే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కలిసి చర్చించుకుని పరిష్కరించుకోవాలని కమలనాథన్ ఈ సందర్భంగా సూచించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమాచారాన్ని నివేదికల రూపంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని, కేంద్రం కూడా నివేదికలను పరిశీలించి, వెంటవెంటనే ఆమోదం తెలియచేస్తోందని వివరించారు. శనివారం జరిగిన చర్చల్లో పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు కూడా ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం విభజన జరగని యూనిట్లకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కమలనాథన్‌కు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు అందించారు. వీటిని కేంద్రానికి పంపిస్తానని కమలనాథన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.