రాష్ట్రీయం

నీటి వాటాలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/ కర్నూలు, మే 7: కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులను అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ప్రజలకు వివరించారు. కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం జరిగిన ఉద్యాన రైతుల రుణ విమోచన పత్రాల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రాజెక్టులనైనా వ్యతిరేకిస్తామని తెలిపారు. రైతుల ఆనందమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై పలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించగా ఇపుడు తెలంగాణ ఆ పనిని ప్రారంభించిందన్నారు. వారి కారణంగా రాష్ట్ర రైతులకు సాగు నీరు లభించని దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రైతులను ఇబ్బంది పెట్టే ఏ ప్రాజెక్టును కూడా తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని అవసరమైతే న్యాయ స్థానాలను ఆశ్రయించి రాష్ట్ర రైతులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. రాయలసీమ రైతులకు ఉపయోగపడే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నదుల అనుసంధానం పూర్తి చేశామని వెల్లడించారు. పట్టిసీమను అడ్డుకోవాలని రాయలసీమకు చెందిన నాయకులు కొందరు అడ్డుపడినా వెనుకడుగు వేయలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు తనకు అండగా ఉంటే కొండలను కూడా బద్దలు కొట్టే సామర్థ్యం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులకు ఇచ్చిన రుణ విముక్తి హామీని ఎట్టి పరిస్థితులు ఎదురైనా అమలు చేసి తీరుతామని ఈ విషయంలో రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2.24 లక్షల మంది ఉద్యాన వన రైతులకు ఉపయోగపడే విధంగా రూ.334 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. దీంతో వారంతా రుణ భారం తగ్గి ఉత్సాహంగా పంటల సాగుకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధికారులు, కాంట్రాక్టర్లు నిరంతరం శ్రమిస్తున్నారని వారికి విశ్రాంతి లేకుండా పని చేయిస్తున్నానని వివరించారు. అందరి శ్రమతో ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరందుతుందని స్పష్టం చేశారు. నీటి ఆవశ్యకతపై రైతులు అవగాహన పెంచుకొని పొలాల్లో పంట కుంటలను తవ్వుకోవాలని, ప్రతి వ్యక్తి బాధ్యతగా ఇంకుడు గుంతలను తవ్వి భూమిపై పడే ప్రతి వర్షపు చినుకు భూగర్భంలోకి ఇంకి పోయేలా చేస్తే భూగర్భంలో జలాలు వృద్ధి చెంది వర్షాభావ పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రైతులు ప్రతి నాలుగు ఎకరాలకు ఒక పంట కుంటను తవ్వుకుంటే అందులో చేరే వర్షపు నీరు అవసరమైనపుడు ఉపయోగపడటమే కాకుండా భూగర్భ జలాలను పెంచుతాయని వివరించారు. ప్రభుత్వ బాధ్యతగా పంట సంజీవని పథకం కింద కుంటలను తవ్వుకోవడానికి రైతులకు సహకరిస్తామని, కాలువలపై చెక్ డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చేస్తామని పేర్కొన్నారు. నీరు లేకపోతే మానవ మనుగడ సాధ్యం కాదని ప్రజలు ఐక్యంగా చెరువుల్లో పూడిక తీత, మరమ్మతులను యుద్ధ రీతిలో చేపట్టాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపల పూర్తి చేసి ఆ నీటిని కృష్ణానదికి అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఓ పక్క ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతుంటే మరోపక్క ప్రాజెక్టులపై అవగాహన లేని నేతలు ప్రాంతాలవారీగా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. వారి హయాంలో లక్షల కోట్లరూపాయలు దోపిడీ చేసిన వారు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గంలో కూడా వేలకోట్లరూపాయలు ఖర్చుచేసి చివరికి తాగునీరు తెప్పించుకోలేకపోతే తమ హయాంలో 2 టిఎంసిల నీటిని పులివెందులకు ఇచ్చి పండ్లతోటల రైతులను ఆదుకుని ఆ ప్రాంతంలో అందరికీ సాగునీరు, తాగునీరు అందించామని జగన్‌కు చురకలు వేశారు. ముఠా కక్షలపై ఉక్కుపాదం మోపుతామాన్నరు.

చిత్రం కర్నూలు జిల్లా కురవళ్లిలో ఇంకుడుగుంత తవ్వుతున్న సిఎం చంద్రబాబు