రాష్ట్రీయం

హోదాపై ప్రధానితో మాట్లాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/కర్నూలు, మే 7: విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం ఉద్యానరైతుల రుణ విమోచన పత్రాల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు విభజన కోరుకోలేదన్నారు. అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో చట్టంలో చేర్చిన ప్రతిపాదనలన్నింటిని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. చట్టంలో పొందుపర్చకుండా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్చల అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి హోదాను సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి లోక్‌సభలో ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారంటూ, అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కన్నా సాధ్యమైనంత వరకు స్నేహ పూర్వక వాతావరణంలో సాధించుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపితో ఇంకా స్నేహ మెందుకు అని విపక్షాలు అంటున్నాయని, వారి మాటలు వింటే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహాయం అందితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను కేంద్రం నుంచి తీసుకువస్తానని అలాగే హోదా సాధిస్తానన్న విశ్వాసం తనకుందని తెలిపారు.