రాష్ట్రీయం

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/ కడప, మే 7: ఎన్నికల సమయంలోనే పార్టీలు, రాజకీయాలు, పట్టింపులని, ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ప్రతినిధులేనని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అభివృద్ధిని ఆమోదించే తెలుగుదేశం పార్టీలోకి పలువురు ఎమ్మెల్యే సోదరులు వస్తున్నారని పేర్కొన్నారు.
శనివారం కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు కడప జిల్లాలో జరిగిన సభలో ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములును సభకు పరిచయం చేస్తూ వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతునిచ్చారని గుర్తు చేశారు. కడప జిల్లాలో రెండుపార్లమెంటరీ, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేవలం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఒక్కరే టిడిపి నుంచి గెలుపొందారని, అయినా తనకు బాధలేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో తాను ముందుంటానన్నారు. ఇలాఉంటే కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలులోని ప్రత్యేక పోలీసు విభాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చ కండువా కప్పి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావాలన్న ఉద్దేశంతో టిడిపిలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలతో పాటు రాష్ట్భ్రావృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

చిత్రం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని పచ్చ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానిస్తున్న
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు