రాష్ట్రీయం

టిఆర్‌ఎస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 7: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి తమ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధి చనిపోతే వారి కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కల్పించే ఆనవాయితీకి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు. ఓటమి భయంతోనే ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజలు తిరస్కరించిన తుమ్మలకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చి అవి చాలవన్నట్లు పాలేరులో పోటీకి నిలిపి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి మంత్రంతో ప్రజలను మాయ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు.అధికార దుర్వినియోగం చేస్తూ, అవినీతి సొమ్ముతో పాలేరులో గెలవాలనుకునే టిఆర్‌ఎస్ ప్రయత్నాన్ని ఓటర్లు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని గెలిపించి టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అయితం సత్యం, రాష్ట్ర నాయకులు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలను విస్మరిస్తున్న ప్రభుత్వం
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకున్నది. దశాబ్ధాల పోరాటం, అమరవీరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను అణగదొక్కాలనుకోవడం అవివేకమన్నారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సర్వ సాధారణమని అయితే కాంగ్రెస్ పార్టీని అణిచి వేయాలనుకోవడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. శాసన సభ్యుడి హక్కుగా దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం బాగుపడేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.