రాష్ట్రీయం

టెండరు దాఖలు చేయని సంస్థకు కాంట్రాక్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: కాంట్రాక్టు రావాలంటే టెండరు వేయాలి, టెండరు వేయాలంటే బిడ్డింగ్‌లో పాల్గొనాలి, తీరా బిడ్డింగ్ పూర్తయిన తర్వాత కూడా టెండరులో పాల్గొనని సంస్థకు కాంట్రాక్టు దక్కితే దానిని ఏమనాలా? ఇలాంటి వింత పోకడలకు ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ (ఐటిసి) పోతోంది. ఇ ప్రగతి ప్రాజెక్టుకు సంబంధించి ఎపిటిఎస్ ద్వారా టెండర్లు పిలిచారు. అందులో ఎల్-1లో నిలిచిన సంస్థను కాదని, మరో సంస్థకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్-1ను కాదని, బిడ్డింగ్‌లో పాల్గొన్న మరో సంస్థకు కాంట్రాక్టును కట్టబెట్టడంలో పెద్ద విడ్డూరం ఏమీ లేదు. చాలా సందర్భాల్లో ఎల్-1లో ఉన్న సం కంటే మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధపడిన సంస్థను ఎంపిక చేయడం అరుదుగా జరుగుతునే ఉంటుంది. అయితే ఎల్-1ను కాదని, అస్సలు కాంట్రాక్టు బిడ్డింగ్‌లో సైతం పాల్గొనని సంస్థకు కట్టబెట్టిన సందర్భాలు ఉండవు. కొద్ది మంది అధికారుల వింతపోకడలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరవు కాస్తా అంతర్జాతీయ మార్కెట్‌లో గంగపాలవుతోంది. నిబంధనల ప్రకారం టెండరు దాఖలు చేసిన అగ్రశ్రేణి ఐటి కంపెనీని కాదని, మరో సంస్థకు కట్టబెట్టాలని చూడటం అంటే అస్మదీయులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ప్రగతి ప్రాజెక్టు టెండర్ బిడ్డింగ్‌లో టిసిఎస్ సంస్థ ఎల్-1గా నిలిచింది. ఫైనాన్షియల్ టెండర్‌లోనూ, ప్రాజెక్టు టెండర్‌లోనూ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సంస్థను పక్కన పెట్టి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో వివాదాస్పదం అయిన మరో కంపెనీకి కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పాల్గొన్న సంస్థల ఎంపికకు ఏర్పాటు చేసిన కన్సల్టెంట్, ప్రాజెక్టును దక్కించుకున్న ఐటి కంపెనీకి అనుబంధ కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించారని, ఆయన అధికారంలో ఉన్న ఒక ప్రముఖునికి అత్యంత సన్నిహితుడనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై గత అసెంబ్లీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టెరా సాఫ్ట్‌వేర్ సంస్థకు టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు, హెరిటేజ్ ఫిన్ లీజ్ లిమిటెడ్‌కు మధ్య విడదీయలేని సంబంధం ఉందని విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన వ్యక్తి ఐమెక్స్ సంస్థను తెరమీదకు తెచ్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ టెండర్‌లో వాస్తవపరిస్థితులను సైతం వివరించేందుకు ఎపిటిఎస్ అధికారులు నిరాకరించారు.