ఆంధ్రప్రదేశ్‌

విశాఖ బీచ్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 8: విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. సెలవుల్లో సందడి చేసేందుకు బీచ్‌కు వచ్చిన వారిలో ఐదుగురు స్నానానికి దిగి అలల తాకిడికి గల్లంతుకాగా, యారాడ బీచ్‌లో మరో వ్యక్తి సముద్రంలో పడి మృత్యువాత పడ్డాడు. విజయనగరం జిల్లా మంగళపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు కె శేషు (16), ఎస్ శ్రావణ్ (16), బివి ప్రసాద్ (16), ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన మరో విద్యార్థి కె సీతన్న (16), బీహార్‌కు చెందిన యువకుడు బాబర్ ఖాన్ (25) గల్లంతైన వారిలో ఉన్నారు. విజయనగరం జిల్లా మంగళపాలెం గ్రామానికి చెందిన 18 మంది టెన్త్ విద్యార్థుల బృందం ఆర్‌కె బీచ్ సందర్శనకు వచ్చారు. వీరిలో 10 మంది విద్యార్థులు బీచ్‌లో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా కెరటాల ఉద్ధృతి పెరగడంతో సముద్రంలో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఏడుగురు విద్యార్థులను రక్షించగలిగారు. మరో ఘటనలో ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన 11 మంది బృందం ఆర్‌కె బీచ్ సందర్శనకు వచ్చారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. కెరటాల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో వీరు కొట్టుకుపోయారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది వీరిలో ఇద్దరిని రక్షించగలిగినప్పటికీ, సీతన్న ఆచూకీ లభ్యం కాలేదు. ఇక బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులు స్థానికంగా కంటైనర్ టెర్మినల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం కావడంతో వీరంతా బీచ్ సందర్శనకు వచ్చారు. వీరిలో బాబర్ ఖాన్ బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం 4-5 గంటల మధ్య వరుస సంఘటనలు చోటుచేసుకోగా కోస్టగార్డ్ సిబ్బంది వీరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. అయిన్పపటికీ ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా యారాడ బీచ్‌లో మరో వ్యక్తి సముద్రంలో పడి మృత్యువాత పడ్డాడు. చేపలవేటలో భాగంగా సముద్రంలోకి వెళ్లిన కె ధనరాజ్ (20) ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. స్థానికులు గమనించి ధనరాజ్‌ను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణం విడిచినట్టు బంధువులు తెలిపారు. టెన్త్ విద్యార్థులు గల్లంతైన వార్త తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు ఆర్‌కె బీచ్‌కు చేరుకున్నారు. తమ బిడ్డల ఆచూకీకోసం వీరంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.