రాష్ట్రీయం

లోయలో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, మే 9: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస పంచాయతీ పరిధిలోని టైగర్ క్యాంపు సమీపంలో సోమవారం ఉదయం యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన టిఎస్-09 యుఎ-5026 అనే బస్సులో కాశీయాత్రకు వెళ్లిన 45 మంది ఆదివారం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శించుకుని, సోమవారం వేకువజామున భద్రాచలం బయలుదేరారు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో మారేడుమిల్లి మండలం టైగర్ క్యాంపు సమీపంలో ప్రమాదకర మలుపువద్ద ఈ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ఏరియా వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న చిత్రగింద విజయ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, అదే జిల్లాలోని కోటంపల్లి గ్రామానికి చెందిన బూతం లక్ష్మీబాయి, చెన్నూరుకు చెందిన ఉప్పరి రమాబాయి, ములుకూరి రాజబాబు, శ్రీరాంపూర్‌కు చెందిన సుంకనపల్లి రాజేంద్ర, అఖిలాపూర్‌కు చెందిన పెరుగు శంకర్, పాత మంచిర్యాలకు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న మారేడుమిల్లి ఇన్‌ఛార్జి ఎస్సై శేషుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. పోలీసు, సిఆర్పీఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని, క్షతగాత్రులను పైకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ వైద్యశాలకు, స్వల్పంగా గాయపడిన వారికి మారేడుమిల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

chitram ప్రమాదానికి గురైన బస్సు