రాష్ట్రీయం

రేపే టెన్త్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర టెన్త్ పరీక్ష ఫలితాలను 11న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు పరీక్షల బోర్డు సంచాలకుడు డాక్టర్ ఆర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయం డి బ్లాక్‌లో ఫలితాలను విడుదల చేస్తారని సురేందర్‌రెడ్డి సోమవారం చెప్పారు.
నేడు ఆంధ్ర టెన్త్ ఫలితాలు
ఆంధ్ర టెన్త్ ఫలితాలను హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు ఓయు సెనేట్ హాల్‌లో నేటి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారని పరీక్షల బోర్డు సంచాలకుడు ఎంఆర్ ప్రసన్నకుమార్ సోమవారం చెప్పారు. ఫలితాలను బోర్డు వెబ్‌సైట్ బిఎస్‌ఇఎపి.ఆర్గ్‌లో ఉంచుతామని వెల్లడించారు.