రాష్ట్రీయం

శ్రీశైలం నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం/ విజయవాడ, మే 9:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంచినీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలంనుంచి 9 టిఎంసిల నీటిని సోమవారం అధికారులు విడుదల చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నీటి విడుదల సుగమమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు టిఎంసిలు, తెలంగాణకు మూడు టిఎంసిల చొప్పున కేటాయించారు. బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని రివర్ స్లూయిస్ గేట్‌ను 10 మీటర్ల మేర ఎత్తి 5775 క్యూసెక్టుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 885 అడుగులకు గాను 784.20 అడుగులు ఉంది. కాగా బోర్డు తీసుకున్న నిర్ణయంతో కృష్ణాడెల్టాలో మంచినీటి కష్టాలు తీరతాయని ఏపి భారీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు.