రాష్ట్రీయం

బాలికలదే పైచేయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. రాష్ట్రంలో 94.52 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 94.3 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణతా శాతం 94.77. ఉత్తీర్ణతలో కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు చివరి స్థానంలో ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల వైవిఆర్ మూర్తి ఆడిటోరియంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 6,17,030 మంది రెగ్యులర్ విద్యార్థులు, 35,344 మంది ప్రైవేట్ అభ్యర్థులు పదవ తరగతి పరీక్షలు రాశారన్నారు. వీరిలో 5,83,266 మంది రెగ్యులర్ విద్యార్థులు, 19,650 మంది ప్రైవేటు విద్యార్థులు పాసయినట్లు తెలిపారు. రాష్ట్రంలో 4,217 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. ఈసారి సున్నా శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు లేవని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో 97.58 శాతం ఉత్తీర్ణత సాధించగా, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 93.35 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 90.31 శాతం, మోడల్ స్కూళ్లలో 96.52 శాతం, మున్సిపల్ పాఠశాలల్లో 89.25 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.
ప్రైవేట్ పాఠశాలల హవా
టెన్త్ పరీక్షల్లో 10 జిపిఎ సాధించినవాటిలో ప్రైవేట్ పాఠశాలలదే పైచేయిగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 6,055 మంది విద్యార్థులు 10 జిపిఎ సాధించగా, ప్రభుత్వ పాఠశాలల్లో 28 మంది, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 225, ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలల్లో 35, మున్సిపల్ పాఠశాలల్లో 19, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో (సొసైటీ) 28 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9, ఎయిడెడ్ పాఠశాలల్లో 45 మంది సాధించారు. అయితే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ఒక్కరు కూడా 10 జిపిఎ సాధించకపోవడం గమనార్హం.
జూన్ 16 నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షలు
జూన్ 16 నుంచి 29 వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. జూన్ 3లోగా విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మార్కుల జాబితాలు 15 రోజుల్లో పంపుతారు. రీకౌంటింగ్ ఆఫ్ మార్క్ సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఈ నెల 23లోగా చెల్లించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాల పునః పరిశీలన, సమాధాన పత్రాల ప్రతి పొందేందుకు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున ఈనెల 23లోగా చెల్లించాలి. డమీ గ్రేడింగ్ జాబితాలు ఇ-సేవా కేంద్రాలు లేదా ఎపి ఆన్‌లైన్ కేంద్రాల నుంచి పొందవచ్చు. ఫలితాలు, ఇతర వివరాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఇఎపి.ఆర్గ్‌లో చూడవచ్చు.

జిల్లాల వారీగా ఉత్తీర్ణ శాతం, 10 జిపిఎ పొందిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా ఉత్తీర్ణత శాతం, 10 జిపిఎ పొందిన విద్యార్థులు

కడప 98.89 797
పశ్చిమ గోదావరి 97.65 587
తూర్పు గోదావరి 97.57 1052
శ్రీకాకుళం 96.08 282
గుంటూరు 94.76 579
విశాఖపట్నం 94.7 535
అనంతపురం 94.57 468
కర్నూలు 94.2 379
కృష్ణ 93.11 485
నెల్లూరు 92.94 250
విజయనగరం 92.47 220
ప్రకాశం 90.59 322
చిత్తూరు 90.11 488

చిత్రం విశాఖలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్న మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు