రాష్ట్రీయం

ఎమ్సెట్ మెడికల్‌కు హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణలో 15న నిర్వహిస్తున్న ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్- మెడికల్ ప్రవేశ పరీక్షలకు అభ్యర్ధులు హాజరుకావాలని ప్రభుత్వం సూచించింది. పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్షకు ఎలాంటి ఆటంకం లేదని, అగ్రికల్చర్ -మెడికల్ స్ట్రీం పరీక్షలో ఎంబిబిఎస్, బిడిఎస్ మినహా మిగిలిన కోర్సులకు ఆ ర్యాంకు ప్రాతిపదికగానే అడ్మిషన్లు జరుగుతాయని ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావు మంగళవారం చెప్పారు. ఎంసెట్ అగ్రికల్చర్- మెడికల్ స్ట్రీం పరీక్షను ఆంధ్రలో, తెలంగాణలో వేర్వేరుగా నిర్వహిస్తున్నా, ఈ పరీక్ష ఆధారంగానే 11 కోర్సులకు అడ్మిషన్లు చేపడుతున్నారు. అందులో ఎంబిబిఎస్, బిడిఎస్‌కు మాత్రం ఇక మీదట నీట్ అర్హత ద్వారా అడ్మిషన్లు చేపడతారు. బిఎస్సీ అగ్రికల్చర్, బిఎస్సీ హార్టికల్చర్, బివిఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ ఫారెస్టు సైన్స్, బిటెక్ ఫారెస్టు సైన్స్ టెక్నాలజీ, బి.ఎస్సీ (సిఎ అండ్ బిఎం), బిఎఎంఎస్, బిఎన్‌వైఎస్, బి ఫార్మసీ, బిటెక్ (బయోటెక్నాలజీ -బైపిసి), ఫార్మా డి (బైపిసి) కోర్సులకు సైతం ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ద్వారానే భర్తీ చేస్తామని ప్రొఫెసర్ రమణారావు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల్లో కొంతకాలం పాటు ఎంసెట్ మెడికల్ స్ట్రీం పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు.