రాష్ట్రీయం

వెంటాడి.. నరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా, మే 10: ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం ఉదయం పాతకక్షలతో ఐదుగురిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. భైంసా పట్టణంలో బార్ ఇమామ్ గల్లీలో నివాసం ఉంటున్న నయామత్‌ఖాన్ కుటుంబానికి తన అన్న కుమారులతో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయ. ఈ నేపథ్యంలో మంగళవారం అన్న కుమారులు శివాజీ చౌక్‌లో పాత ఇనుపసామన్ విక్రయ దుకాణంలో ఉన్న నయామత్‌ఖాన్ (55), యూనిస్‌ఖాన్ (35)లపై కళ్లల్లో కారం చల్లి గొంతుకోసి పాశవికంగా హత్యచేశారు. ఈ సమయంలో హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన షేక్ అమీర్, జబ్బర్‌లకు సైతం గాయాలయ్యాయి. అనంతరం పట్టణంలోని బార్ ఇమామ్ గల్లీకి వెళ్లి మృతుడు నయామత్‌ఖాన్ భార్యపై దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఇంతటితో నరమేధాన్ని ఆపకుండా పట్టణంలోని నయాబాదికి వెళ్లి అక్రమ్‌బి (62), ఆయేషాబేగం (15)లపై విచక్షణా రహితంగా దాడిచేసి పారిపోయారు. స్థానికులు అక్రమ్‌బి, ఆయేబేగంలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్రమ్‌బి ఆసుపత్రిలో మృతి చెందింది. ఆయేబేగం తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకై నిజామాబాద్ తరలిస్తుండగా ఆయేషాబేగం సైతం మృతి చెందింది. మృతులందరూ దగ్గరి దగ్గరి కుటుంబ సభ్యులు కాగా హత్యకు పాల్పడ్డ హంతకులు మృతుల అన్నదమ్ముల కుమారులుగా భావిస్తున్నారు. ఒకేరోజు ఏకకాలంలో ఐదు హత్యలు జరగడంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. పోలీసులు అప్రమత్తమయ్యే లోపే హత్యలు జరగడం తీవ్ర సంచలనాన్ని రేపింది. ఘటన స్థలానికి భైంసా డిఎస్పీ అందె రాములు, నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి, ఒఎస్‌డి పనసారెడ్డి, సిఐలు పురుషోత్తంరెడ్డి, వినోద్‌లు చేరుకుని శాంతి భద్రతలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. దోషులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భైంసా మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జాబీర్ అహ్మద్ సహచర కౌన్సిలర్లు హత్యాకాండపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేశారు.
అదుపులో శాంతిభద్రతలు: డిఐజి
పట్టణంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కరీంనగర్ రేంజ్ డిఐజి మల్లారెడ్డి వెల్లడించారు. భైంసా పట్టణంలో మంగళవారం ఐదు హత్యలు జరిగిన నేపథ్యంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. హత్యలకు పాల్పడిన దోషులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వదంతులను నమ్మవద్దన్నారు. అనుమానితుల వివరాలను పోలీసులకు చేరవేయాలని తెలిపారు. భైంసాలో చోటుచేసుకున్న సంఘటన విచారకరమని, పోలీసుల వైఫల్యం లేదని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్యలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. ఆయనవెంట ఓఎస్‌డి పనసారెడ్డి, పోలీసు అధికారులు ఉన్నారు.

చిత్రం భైంసాలో ఘటనా స్థలంలో పడివున్న మృతదేహాలు