రాష్ట్రీయం

ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు కోడలు, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి ప్రజాసేవకు అరంగేట్రం చేశారు. నారా లోకేష్‌తో వివాహం జరిగిన నాటి నుండి కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూస్తూ వచ్చిన బ్రహ్మణి తొలిసారి ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ హోదాలో శుక్రవారం నాడు పాత్రికేయుల ముందుకు వచ్చారు. ట్రస్టు తరఫున చేస్తున్న , చేయబోయే కార్యక్రమాలను ఆమె వివరించారు. 2016లో కృష్ణా, వరంగల్ జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్‌లో కెజి నుండి పిజి వరకూ నాణ్యమైన విద్యను అందిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను, దశలవారీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల్లోనైపుణ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది డెవలప్‌మెంట్ సెంటర్‌లను ప్రారంభించామని వివరించారు. కోర్సు పూర్తయిన వెంటనే వివిధ కంపెనీలను పిలిపించి ప్లేస్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నిజం చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రధానంగా గ్రూప్-1, గ్రూప్-2తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంకింగ్ పరీక్షలకోసం పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు. పార్టీ కోసం మరణించిన కార్యకర్తల పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ట్రస్ట్ సిఇఓ మోహనరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యావిభాగాన్ని మరింత పటిష్టపరుస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, జడ్చర్ల కేంద్రాల్లో ప్రాథమిక పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వారికి శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో ‘బిట్ డాట్ ఎల్‌వై/ఎన్టీఆర్ కాంపిటీటివ్‌ఎగ్జామ్’ అనే వెబ్‌సైట్‌లో 25వ తేదీ సాయంత్రం వరకూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. 29న ప్రాథమిక పరీక్ష జరుగుతుందని వివరించారు.