రాష్ట్రీయం

కొత్త ఏడాదిలో సెలవులివే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది సెలవులు ప్రకటించింది. 19 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు, 14 ఎన్‌ఐ సెలవులను ప్రకటించింది.
సాధారణ సెలవులు
జనవరి 14న (గురువారం) భోగి, 15 (శుక్రవారం) సంక్రాంతి, 16 (శనివారం) కనుమ, 26 (మంగళవారం) గణతంత్ర దినోత్సవం, మార్చి 7 (సోమవారం) మహాశివరాత్రి, 23 (బుధవారం) హోలీ, 25 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 (మంగళవారం) జగ్జీవన్‌రాం జయంతి, 8 (శుక్రవారం) ఉగాది, 14న (గురువారం) డాక్టర్ అంబేద్కర్ జయంతి, 15 (శుక్రవారం) శ్రీరామ నవమి, జూలై 6 (బుధవారం) రంజాన్, ఆగస్టు 15 (సోమవారం) స్వాతంత్య్ర దినోత్సవం, 25 (గురువారం) జన్మాష్టమి, సెప్టెంబర్ 5 (సోమవారం) వినాయక చవితి, 12 (సోమవారం) బక్రీదు, అక్టోబర్ 11 (మంగళవారం) విజయదశమి, 12 (బుధవారం) మొహర్రం, డిసెంబర్ 12 (సోమవారం) ఈద్ మిలాదున్ నబీ.
ఇలాఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి, అదే నెల 10 దుర్గాష్టమి, 30వ తేదీన దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ ఆదివారం వచ్చాయి.
ఐచ్ఛిక సెలవులు..
జనవరి 1 (శుక్రవారం) కొత్త సంవత్సరం, 27 (శుక్రవారం) యాజ్ దహుమ్, ఫిబ్రవరి 13 (శనివారం) శ్రీ పంచమి, 23 (మంగళవారం) హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువనపురి మెహిదీమావుద్, ఏప్రిల్ 19న (మంగళవారం) మహావీర్ జయంతి, 21 (గురువారం) హజ్రత్ అలీ జయంతి, మే 5 (సోమవారం) షబ్-ఇ-మేరాజ్, 9 (సోమవారం) బసవ జయంతి, 21 (శనివారం) బుద్ధపూర్ణిమ, 23 (సోమవారం) షబ్-ఇ-బరాత్, జూలై 1 (శుక్రవారం) జమాతుల్ వదా, 6 (బుధవారం) రథ యాత్ర, ఆగస్టు 12 (శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం, 17 (బుధవారం) పార్శి కొత్త సంవత్సరం, 18 (గురువారం) రాఖీ పౌర్ణమి (శ్రావణ పూర్ణిమ), సెప్టెంబర్ 20 (మంగళవారం) ఈద్-ఇ-గదీర్, 30 (శుక్రవారం) మహాలయ అమావాస్య, అక్టోబర్ 10 (సోమవారం) మహర్నవమి, 29 (శనివారం) నరక చతుర్థి, నవంబర్ 14 (సోమవారం) కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి, 21 (సోమవారం) అర్బయిన్, డిసెంబర్ 24న (శనివారం) క్రిస్మస్ ఈవ్, 26న (సోమవారం) బాక్సింగ్ డే. ఇలాఉండగా ఐచ్చిక సెలవులు రెండు ఆదివారం వచ్చాయి. జూన్ 6న షహదత్ హజ్రత్ అలీ (ఆర్‌ఎ), జూలై 8న షబ్-ఇ-ఖదర్.