రాష్ట్రీయం

రేపే తెలంగాణ ఇసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణ రాష్ట్రంలో ఇసెట్ పరీక్షను గురువారం(12న) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏడు రీజినల్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ ఏడు పట్టణాల్లో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 26,994 మంది దరఖాస్తు చేయగా పలు కారణాలతో 24 మంది దరఖాస్తులను సెట్ నిర్వాహకులు తిరస్కరించారు. 26,970 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు మొదలవుతుందని, అయితే అభ్యర్ధులు మాత్రం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జెఎన్‌టియు హెచ్ అధికారులు తెలిపారు. నిజామాబాద్‌లో 1572 మంది, కరీంనగర్‌లో 3013 మంది, వరంగల్‌లో 4838, ఖమ్మంలో 2798, నల్గొండలో 1570, మహబూబ్‌నగర్‌లో 1485, హైదరాబాద్‌లో 11714 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం నిజామాబాద్‌లో 4, కరీంనగర్‌లో 7, వరంగల్‌లో 9, ఖమ్మంలో 5, నల్గొండలో 3, మహబూబ్‌నగర్‌లో 2, హైదరాబాద్‌లో 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు.