రాష్ట్రీయం

గొప్ప సంస్కర్త రామానుజాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 10: ఈ సహస్రాబ్దిలో గొప్ప సామాజిక సంస్కర్తగా భగవద్ రామానుజాచార్యులు నిలిచిపోయారని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఉద్ఘాటించారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ సభ మంగళవారం స్థానిక మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ శ్రీ వైష్ణవతత్వానికి భూషణం వంటివారు రామానుజాచార్యులని అన్నారు. పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతునిపై శరణాగతి పాటిస్తే మోక్షం తప్పక సిద్ధిస్తుదని, దీనికి కుల వర్ణ లింగబేధాలు లేవని ఆచార్యులవారు వెయ్యేళ్ళ ముందే చెప్పారని తెలియజేశారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమానత్వాన్ని ఆయన ప్రతిపాదించారని వివరించారు. శ్రీరామానుజులు నవరత్నాల్లాంటి 9 గ్రంథాలు రచించి లోకానికి అందించారన్నారు.
కర్తవ్య నిర్వహణ, అంకితభావం, భక్త్భివం అలవరచుకుంటే అందరూ ఉన్నతికి చేరుకుంటారని తెలిపారు. సన్నిధి భాష్యకారుల ఆలయంలో వెండి పీఠం బదులు బంగారుపీఠం ఏర్పాటు చేయాలని టిటిడిని కోరారు. టిటిడి చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనం చేస్తూ శ్రీరామానుజులు దేశమంతటా పాదయాత్ర చేసి సమాజాన్ని ఆధ్యాత్మికంగా చైతన్యవంతం చేసినట్లు తెలిపారు. టిటిడి తరపున ఒక సంవత్సరం పాటు ఆయన వైభవాన్ని ప్రచారం చేయడం ముదావహమన్నారు. టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీరామానుజాచార్యులు వెయేళ్ల క్రితం తిరుమల, తిరుపతిలో నిత్యకైంకర్యాలను నిర్దేశించారని, పలు ఉత్సవాలను ప్రవేశపెట్టారని తెలిపారు. టిటిడి ఇ ఒ సాంబశివరావు మాట్లాడుతూ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను సనాతన ధర్మప్రచారానికి అవకాశంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. రామానుజ తత్వాన్ని ప్రచారం చేస్తామని వివరించారు. ఈ దివ్యదేశాలను 30 క్లస్టర్లుగా విభజించి శ్రీనివాస కల్యాణాలునిర్వహిస్తామన్నారు. అంతకుముందు తిరుమల బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీరామానుజ సంచార రథయాత్రను గవర్నర్ దంపతులు లాంఛనంగా ప్రారంభించారు.

చిత్రం తిరుమలలో శ్రీరామానుజాచార్యుల సహస్త్రాబ్ది ఉత్సవాల
సంచార రథాన్ని ప్రారంభిస్తున్న గవర్నర్ దంపతులు