జాతీయ వార్తలు

ఇక పప్పు్ధన్యాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పప్పుల ధరలు రోజురోజుకు పెరుగుతూ కిలో ఒక్కంటికి రూ. 190కి చేరడంతో పప్పు ధాన్యాల ఆపద్ధర్మ నిల్వలను (బఫర్ స్టాక్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇందుకోసం 1.5 లక్షల టన్నుల కాయధాన్యాలను సేకరించాలని, రిటెయిల్ మార్కెట్‌లో పప్పుల ధరలు పెరిగినప్పుడు వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. అవసరమైతే కాయధాన్యాలను దిగుమతి చేసుకోవాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. రిటెయిల్ మార్కెట్‌లో ధరలు పెరిగినపుడు, మార్కెట్‌లోకి విడుదల చేయడం కోసం పప్పు్ధన్యాలను నిల్వ చేసి ఉంచనున్నట్లు ప్రభుత్వం అక్టోబర్‌లో ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ (సిసిఇఏ) బుధవారం ఆమోదించినట్లు ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలోనే ఈ పప్పు్ధన్యాల నిల్వలను ఏర్పాటు చేస్తారు. 2015-16 ఖరీఫ్ సీజన్ పంట నుంచి 50వేల టన్నులు, 2015-16 రబీ పంట నుంచి ఒక లక్ష టన్నుల పప్పు్ధన్యాల సేకరణకు సిసిఇఏ ఆమోదం తెలిపిందని ఆ ప్రకటన వెల్లడించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ), కోఆపరేటివ్ నాఫెడ్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఏసి)తో పాటు నిర్ణయించిన మరేదైనా సంస్థ ద్వారా మార్కెట్ ధరలపై పప్పు్ధన్యాలను సేకరిస్తారు. అంటే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కన్నా ఎక్కువ ధర చెల్లిస్తారు. పప్పు ధాన్యాల సేకరణకు ధరల స్థిరీకరణ నిధినుంచి డబ్బు చెల్లిస్తారు. ఒకవేళ అవసరమైతే, వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని కూడా సిసిఇఏ నిర్ణయించింది. ఒకవేళ మార్కెట్‌లో పప్పుల ధరలు కనీస మద్దతు ధరకన్నా తక్కువకు పడిపోతే, అప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధరల మద్దతు పథకం కింద కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చెల్లించి పప్పు ధాన్యాలను సేకరించాలని నిర్ణయించారు. ‘పప్పు ధాన్యాల ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ఆపద్ధర్మ నిల్వను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.