తెలంగాణ

తప్పిన తాగునీటి కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 11: ఎట్టకేలకు ఈ వేసవిలో ఓరుగల్లు ప్రజలకు తాగునీటి కటకట లేకుండా పోయింది. వరంగల్ మహానగర పాలక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరాయి. బుధవారం ఉదయం ధర్మసాగర్ చెరువులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం అమలవుతున్న గంగారం వెళ్లి ఇంటెక్ పంప్‌హౌస్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పలుమార్లు సందర్శించి గోదావరి నీటిని ఎత్తిపోయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ పరిశీలనలో డిప్యూటీ సిఎం కడియం ఇంటెక్‌వెల్ వద్ద ఉన్న మెకానిక్ స్థాయి వ్యక్తులతో మాట్లాడారు. ఈ పనిని మెస్సర్స్ పవర్ సొల్యూషన్, హైదరాబాద్ వారికి అప్పగించగా పదహారు 70 హెచ్‌పి మోటార్లు, 50 హెచ్‌పి సమ్మర్సబుల్ మోటార్లు, రెండు 150 హెచ్‌పి మోటార్లు, ఒక 100 హెచ్‌పి మోటార్లు బిగించి ఇంటెక్ పంప్‌హౌస్ వద్ద ఏప్రిల్ 22వ తేదీన గోదావరి నీటి పంపింగ్ మొదలు కాగా బుధవారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గోదావరి జలాలు ధర్మసాగర్ చెరువుకు చేరుకున్నాయి.
ఇందుకు గాను 5.30 కోట్ల రూపాయలను విద్యుత్ కొరకు, 3.66 కోట్ల రూపాయలను ఇంటెక్‌వెల్ పంప్‌హౌస్ నుండి నీటిని ఎత్తిపోయడానికి వినియోగించుకునేందుకు గాను మొత్తం 8.96 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశారు. గోదావరి జలాలు ధర్మసాగర్ చెరువుకు చేరడానికి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది.