తెలంగాణ

తెలుగు దేశం పార్టీని వీడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాష్ట్ర సమితిలో తాను చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తనకు ఎంతో బాధ్యతాయుతమైన, అత్యంత ప్రధానమైన పార్టీ అధ్యక్ష పదవిని, ఎనలేని గౌరవాన్ని ఇచ్చిన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడనని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టి.టిడిపి అధ్యక్షుడు రమణ విమర్శించారు. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కెసిఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రమణ విమర్శించారు. పటేల్, పట్వారీ వ్యవస్థ నుంచి తెలంగాణలోని బడుగు, బలహీన సామాజిక, సామాన్యులను విముక్తి చేసింది నాడు ఎన్టీఆరేనని టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు.