రాష్ట్రీయం

అమరావతికి వెళ్తాం.. సర్కార్‌కు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్టు రాజధాని ప్రాంతానికి వెళ్లి పనిచేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. విభజన కారణంగా ముందుగా నష్టపోయింది ఉద్యోగులేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నందున తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అమరావతికి తరలివెళ్లే ఉద్యోగులకు తలెత్తే సమస్యలను సిఎం, సిఎస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. మరో పక్క వచ్చే నెలలో అమరావతికి తరలివెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. సౌకర్యాలు లేకుండా అక్కడికి వెళ్లలేమని చెబుతున్నారు. హడావుడిగా తమను తరలించాలనుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెలుపుతున్నారు. జూన్‌లోనే తరలివెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం సరికాదని, మరో ఏడాది సమయం కోరారు. ఈ విషయంలో మురళీకృష్ణతో కొంత మంది ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. స్పష్టమైన హామీలు ప్రభుత్వం నుండి రాకుండా ఎలా తరలివెళ్తామని ప్రశ్నించారు. అయితే ఉద్యోగుల అభ్యంతరాలను ఇప్పటికే సిఎం దృష్టికి తీసుకువెళ్లామని, సిఎం సానుకూలంగా ఉన్నారని మురళీకృష్ణ తెలిపారు.