రాష్ట్రీయం

తక్షణమే భూసేకరణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్ర రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా కర్నూలు జిల్లాలో సంజామల, కొలిమిగుండ్ల మధ్య 40 కి.మీ రైలు మార్గం వేసేందుకు వెంటనే భూసేకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం ఆయన ఇక్కడ సచివాలయంలో సిమెంట్ పరిశ్రమపై సమీక్షించారు. రాష్ట్రంలో 10.5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తికి లైసెన్సులు మంజూరు చేశామన్నారు. కొత్త మైనింగ్ పాలసీ కింద వెయ్యి మిలియన్ టన్నుల సున్నపు రాయి గనుల తవ్వకానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పరిశ్రమల యాజమాన్యాలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. సిమెంట్ పరిశ్రమల వల్ల రాష్ట్ర ఖజానాకు సాలీనా 267. 11 కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. రైల్వే శాఖకూడా సిమెంట్ పరిశ్రమకు సంబంధించి రవాణా విషయంలో కొత్త లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకంపై సమీక్ష
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. రాష్ట్రంలో 55616 కి.మీ మేర అంతర్గత రోడ్లు ఉన్నాయని, ఇందులో సిసి రోడ్లు 29089 కి.మీ మేర వేయాల్సి ఉందన్నారు. సాగు నిమిత్తం రాష్ట్రంలో 18వేల చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. దీని నిమిత్తం రూ.900 కోట్ల నిధులను ఖర్చుపెట్టనున్నట్లు చెప్పారు. వ్యవసాయ చెరువుల నిర్మాణం నిమిత్తం అన్ని చర్యలు తీసుకోవాలని అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.