రాష్ట్రీయం

‘రాజధాని’ ఆదాయంపై ఇన్‌కంటాక్స్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: ఆదాయపన్ను శాఖ కన్ను రాజధాని రైతులపై పడింది. త్వరలో ఈ ప్రాంతంలో జరగనున్న భూముల క్రయ, విక్రయాలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. క్యాపిటల్ గెయిన్ కింద రైతుల నుంచి పెద్ద మొత్తంలో రాబట్టుకోడానికి ఆదాయ పన్ను శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్టు భోగట్టా. రాజధాని కోసం ప్రభుత్వం సుమారు 34 వేల ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా కొన్ని గజాల స్థలాన్ని ప్రభుత్వం తిరిగి రైతులకు ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఒక ఎకరం మెట్ట భూమి ఇచ్చిన రైతుకు 1000 గజాలు నివాస ప్రాంతంలోను, 250 గజాలు కమర్షియల్ ప్రాంతంలోను ఇవ్వబోతోంది. అలాగే, ఎకరా జరీబు భూమికి 1450 గజాల స్థలాన్ని ఇవ్వబోతోంది. ఇందులో 1000 గజాలు నివాస ప్రాంతంలోను, 450 గజాలను కమర్షియల్ ఏరియాలో ఇవ్వనుంది.
ఇలా ఇచ్చిన స్థలాల్లో రైతులు భవనాలు నిర్మించుకోవచ్చు. లేదా అమ్ముకోవచ్చు. అక్కడే నివసించాలనుకున్న వారికి ఇబ్బంది లేదు. స్థలాలను అమ్ముకోవాలనుకున్న రైతులు విధిగా ఆదాయ పన్ను చెల్లించాల్సిందే. ఇప్పుడు ధరల ప్రకారం రాజధాని ప్రాంతంలో చదరపు అడుగు ప్రభుత్వ బుక్ వాల్యూ ప్రకారం 10 వేల రూపాయలు ఉంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వం పెంచబోతోంది. స్థలాలను అమ్మచూపే రైతులు చదరపు గజానికి 20 నుంచి 25 వేల రూపాయలు వస్తుందని భావిస్తున్నారు. ఈ విలువ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నివాస ప్రాంతాల్లోని వెయ్యి చదరపు గజాల స్థలాన్ని రెండున్నర కోట్ల రూపాయలకు విక్రయించవచ్చని రైతులు ఆశపడుతున్నారు. అయితే, ఇంత మొత్తాన్ని పూర్తిగా ఇంటికి తీసుకువెళ్లడానికి వీల్లేదు. ఇందులో 20 శాతం మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ కింద ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. రెండు కోట్ల రూపాయలకు భూమిని విక్రయించే రైతులు 20 శాతం లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద 40 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. అదే రెండున్నర కోట్లకు విక్రయిస్తే, మరికొంత ఎక్కువ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రైతు దగ్గర నుంచి వెయ్యి గజాల స్థలాన్ని కొని, మూడేళ్ళ లోపు తిరిగి విక్రయించాలనుకున్న వారు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద 30 శాతం మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖకు చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో సగం ప్లాట్లు రైతులు ఇతరులకు విక్రయించినా, ఆదాయ పన్ను శాఖకు కనీసం 400 నుంచి 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
ఈ ఆదాయ పన్ను నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సంప్రదింపులు జరిపారు. కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఇంత భారీ ఆదాయాన్ని వదులుకోవడానికి ఆదాయపన్ను శాఖ కూడా సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక ప్లాట్లు
రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్లాట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్లాట్‌లు కొనుగోలు చేయడానికి బిల్డర్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ఎండోమెంట్ స్థలాలను లే-అవుట్లుగా మార్చి వాటిని ఎన్‌ఆర్‌ఐలకు విక్రయించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
.