రాష్ట్రీయం

నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ధరలు పెరిగే అవకాశం ఉన్న నిత్యావసరాలను ముందుగానే సమీకరించి, చౌకడిపోల ద్వారా పంపిణీ చేసి మార్కెట్‌లో ధరలను స్థిరీకరించేందుకు ముందస్తు ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వం నుండి 2వేల మెట్రిక్ టన్నుల కందులను సేకరించి చౌక డిపోల ద్వారా విడుదలకు సిద్ధం చేసింది. అదే విధంగా రాష్ట్రప్రభుత్వం సేకరించిన మరో మూడు లక్షల టన్నులను కూడా మార్కెట్‌లోకి తేనుంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత చెప్పారు. మిల్లర్లు రాష్ట్రంలో, బయటి రాష్ట్రాల్లో కూడా అక్రమంగా కందిపప్పును నిల్వ చేసి రాష్ట్రంలో ధరలు పెరిగిన తర్వాత అమ్మాలని చూస్తే ప్రభుత్వం ఊరుకోదని ఆమె చెప్పారు. ప్రభుత్వం దాడులుచేసి అదనపు నిల్వలను స్వాధీనం చేసుకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్‌లో 44.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రబీలో కూడా మరో 30 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని అన్నారు.