రాష్ట్రీయం

ఎస్‌ఎస్‌సి పరీక్షల టైమ్ టెబుల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: సెకండరీ స్కూల్ సర్ట్ఫికెట్ (ఎస్‌ఎస్‌సి) పబ్లిక్ ఎగ్జమినేషన్-2016 పరీక్షల టైమ్ టెబుల్‌ను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులకు కొత్త సిలబస్ ప్రకారం ఈ వార్హిక పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి 12.15 గంల వరకు నిర్వహిస్తారు. ఎస్‌ఎస్‌సి, ఒకేషనల్ కోర్స్ అభ్యర్థుల పరీక్షల టైమ్ టెబుల్:
తేదీ సబ్‌జెక్ట్/పేపర్
21-3-2016 ప్రథమ భాష పేపర్-1
22-3-2016 ప్రథమ భాష పేపర్-2
24-3-2016 ద్వితీయ భాష
26-3-2016 ఇంగ్లీష్ పేపర్-1
28-3-2016 ఇంగ్లీష్ పేపర్-2
29-3-2016 మాథ్స్ పేపర్-1
30-3-2016 మాథ్స్ పేపర్-2
31-3-2016 జనరల్ సైన్స్ పేపర్-1
01-4-2016 జనరల్ సైన్స్ పేపర్-2
02-4-2016 సోషల్ స్టడీస్ పేపర్-1
04-4-2016 సోషల్ స్టడీస్ పేపర్-2
06-4-2016 సంస్కృతం, అరబిక్, పార్షియన్ పేపర్-1
07-4-2016 సంస్కృతం, అరబిక్, పార్షియన్ పేపర్-2
09-4-2016 ఎస్‌ఎస్‌సి ఒక్షెనల్ కోర్స్ (్థయరీ)

విసిల నియామకం కోరుతూ
ఎబివిపి ఆందోళన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 9: ఓయూ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బుధవారం చలో ఉస్మానియా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన జివో నెం. 28, 29ను రద్దు చేయాలని, వెంటనే విసి పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. దీంతో ఓయూలో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ యూనివర్సిటీలో మెస్ చార్జీలు పెంచాలని, వచ్చే ఏడాదిలో జరిగే ఓయూ ఉత్సవాలకు వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
‘కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
ఈ నెల 10న ఓయూలో నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి జె నిరంజన్ అన్నారు. ఎలాంటి పండగలు నిర్వహించరాదని కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యత ఓయూ అధికారులు, పోలీసులపై ఉందన్నారు. విశ్వవిద్యాలయంలో బీఫ్, పోర్కు, బోటీ పండగలు ముఖ్యం కాదని, విద్యార్థుల చదువులే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.