రాష్ట్రీయం

తప్పిన పెను ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, మే 13: పోలీసు బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు పన్నిన వ్యూహాన్ని ఆంధ్రా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది భగ్నంచేశారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఏడుగుర్రాలపల్లి గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు శుక్రవారం గుర్తించారు. అలాగే మరో ప్రదేశంలో మరో మూడు మందుపాతరలు అన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో వారపు సంత జరుగుతుంది. దండకారణ్య సమీపంలో ఈ గ్రామం ఉండటంతో పోలీసులు ఏడుగుర్రాలపల్లి సరిహద్దు ప్రాంతాన్ని చుట్టుముట్టి వారి అధీనంలోకి తీసుకుంటారు. ఇదే అదనుగా భావించిన మావోయిస్టులు ఏడుగుర్రాలపల్లి సమీపంలోని రేగులపాడు గుంపులో ఓ మామిడిచెట్టు కింద పోలీసులు లక్ష్యంగా రెండు మందు పాతరలను అమర్చారు. శుక్రవారం వారాంతపు సంత కావడంతో యథావిధిగా పోలీస్ బలగాలు ఏడుగుర్రాలపల్లి సరిహద్దు ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో రేగులపాడు గుంపులో రెండు మందుపాతరలు గుర్తించారు. అలాగే మరో ప్రదేశాన్ని తనిఖీ చేస్తుస్తుండగా మరో మూడు పాతరలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. చీకటి కావడంతో శనివారం ఉదయం బాంబ్ స్క్వాడ్స్‌ను రప్పించి గుర్తించిన రెండు మందుపాతరలను నిర్వీర్యం చేయనున్నట్టు చింతూరు సిఐ దుర్గారావు తెలిపారు. మూడు మందుపాతరలు ఉన్నాయా లేదా అన్న విషయం శనివారం తెలుస్తుందని చింతూరు ఎస్‌ఐ గజేంద్రకుమార్ అన్నారు. మందుపాతరలను గుర్తించడం వల్ల పోలీస్ బలగాలకు పెనుప్రమాదం తప్పినట్టయింది.

సిఆర్‌పిఎఫ్ దళాలు వెలికితీసిన మందుపాతర