తెలంగాణ

ప్రలోభాల పర్వానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 13: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఆయా పార్టీల రాష్ట్ర నేతలు ఖమ్మంలో మకాం వేసి గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే ఇక మిగిలిన రెండు రోజులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి గెలిచే ప్రయత్నాలు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికలు జరగనుండగా గెలుపు కోసం ప్రధాన పక్షాలైన టిఆర్‌ఎస్, కాంగ్రెస్, సిపిఎంలు నూతన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరితారెడ్డిని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఎంపి మధుయాష్కి పాలేరులో విస్తృత ప్రచారం చేశారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావు గెలుపును కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర నేతలు విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఎవరికి వారే తమదైన శైలిలో ముందుకెళ్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియనుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని షురూ చేసే పనిలో ఉంటున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకై మండలానికి ముగ్గురు మంత్రులు పర్యటించగా, తాజాగా బూత్‌లెవల్‌గా నాయకులను ఎంపిక చేసి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా టిఆర్‌ఎస్ నాయకులకు భిన్నంగా కాంగ్రెస్ నేతలు తమదైనశైలిలో ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగానే ఆ ప్రాంతాల్లో పార్టీ నాయకులనే ప్రలోభాల పర్వానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ రెండింటిని చూసి సిపిఎం మాత్రం తామేం తక్కువ కాదని, నోటుకు ఓట్లు అమ్ముకోవద్దని ప్రజా సమస్యల పరిష్కారానికి మద్దతునిచ్చేది తామేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. శనివారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండటంతో ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొన్న ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులంతా జిల్లాను విడిచిపెట్టి వెళ్ళాలని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.