తెలంగాణ

కెసిఆర్ ఆటలు సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 13: సందర్భాలను బట్టి ప్రజల దృష్టిని మళ్లించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కరువు కోరల్లో విలవిలలాడుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ తెరపైకి తాజాగా జిల్లాల విభజన తీసుకొచ్చాడని ఆయన అన్నారు. అయితే జూన్ 2న జిల్లాల విభజనపై ముసాయిదా ప్రకటన జరుగుతుందా లేదా కరువుపై దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడో అనే అంశం తేలుతుందన్నారు. అయితే జిల్లాల విభజన అశాస్ర్తియంగా జరిగితే ఊరుకునేది లేదన్నారు. అందుకోసం ప్రజలను సమీకరించి ఈ విషయంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ప్రజల కోరికకు భిన్నంగా జిల్లాల విభజన జరిగితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణలో బిజెపి ఒంటరిగా బలపడడానికి అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల ఎన్‌డిఏ పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. పార్టీని ప్రతి పల్లెలో విస్తరింపజేసి 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. కేంద్ర ప్రభుత్వం కరువు సహాయంపై విడుదల చేసిన నిధులపై ఖర్చు వివరాలను శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని, వ్యవసాయ నిర్దేశిత పథకాలకు కేంద్ర నిధులు ఖర్చు చేయకుండా ఇతర వాటికి దారి మళ్లిస్తున్నాడన్నారు. కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు 194 రూపాయలు ఇవ్వాల్సివుండగా అన్ని ఖర్చులు పోను కూలికి వంద రూపాయలే అందిస్తున్నారని దీనిపై ఇప్పటికే తాను గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై త్వరలోనే అర్హులైన వారందరిని సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 90వేల గృహాలను మంజూరు చేసిందని, ఒక్కో గృహానికి 2లక్షల వరకు కేటాయించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో కంతనపల్లి ప్రాజెక్టు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, వెంటనే కంతనపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంతనపల్లి ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేసి అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం పట్ల ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. కంతనపల్లి ప్రాజెక్టు ద్వారానే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు సాగునీరు అందుతుందని అన్నారు. రైతు సంక్షేమం కోసం త్వరలోనే తెలంగాణ బిజెపి బృందం కేంద్ర మంత్రులను కలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.