రాష్ట్రీయం

ఎంసెట్‌పై మళ్లీ సుప్రీంకోర్టుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 14: రాష్ట్రంలో ఎంబిబిఎస్, డెంటల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి నెలకొన్న సందిగ్ధతపై మరోసారి సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మెడిసిన్‌లో ప్రవేశానికి సంబంధించి కేంద్రం అధీనంలోని నీట్ ద్వారానే భర్తీ చేయాలని సుప్రీం ఇప్పటికే తెగేసి చెప్పిన నేపథ్యంలో ఈసారికి వెసులుబాటు కల్పించే రీతిలో సుప్రీంను ఒప్పించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేయనున్నట్టు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నీట్‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంసెట్ మెడికల్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసి వివరించినట్టు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎంసెట్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతోందని, ఇదే అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి ఈసారికి నీట్ నుంచి తప్పించాలని కోరనున్నట్టు ఆయన తెలిపారు.
ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, ప్రధానికి సమస్యను వివరించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య పరస్పరం చోటుచేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు సరికావని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, అప్పటి విపక్ష ప్రతినిధులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై పట్టుబట్టారని గుర్తుచేశారు.