రాష్ట్రీయం

భక్తులతో తిరుమల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 14: తిరుమలలో శనివారం కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి రెండు కిలోమీటర్ల మేర భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. దీంతో సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం ద్వారా 8 గంటలు సమయం పడుతోంది. శనివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 62,659 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 25 వేల మందికిపైగా స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో వసతి కొరత ఏర్పడింది. గదులు దొరకని భక్తులు ఉద్యానవనాలు, పేవ్‌మెంట్‌లను ఆశ్రయించారు. గదుల కోసం 4 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలనీలాలు సమర్పించడానికి కూడా 3 గంటలపాటు భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు టాక్సీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

chitram భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల