రాష్ట్రీయం

వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు ఉదయం 3.30 నుంచి 5 గంటల వరకు స్వామివారికి బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు కల్యాణ మండపంలో స్వపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి పెద్ద శేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
chitrm తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం నిర్వహిస్తున్న దృశ్యం