రాష్ట్రీయం

కెసిఆర్‌ది మాటల గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: గోదావరి నీటి పారుదల ప్రాజెక్టులపై సిఎం కె. చంద్రశేఖర్ రావు మాటల గారడి చేస్తున్నారని గోదావరి నదీ జలాల సద్వినియోగంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర ప్రకృతి వైపరీత్యాల నిరోధక సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి శనివారం బేగంపేటలోని ‘సెస్’ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గోదావరి నదీ జలాల వినియోగంపై సిఎం కెసిఆర్ మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ఎత్తిపోతలకు విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారని, ఆ వ్యయ భారం ఎవరిపై మోపుతారని ప్రశ్నించారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ 1986లోనే గోదావరి నుంచి కోటి ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని మర్రి చెన్నారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఎడారిగా మారకుండా ఉండాలంటే గోదావరి నదీ జలాలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారని తెలిపారు.
టర్కీకి- తెలంగాణకు పోలికలు
టర్కీకి- తెలంగాణకు పోలికలు ఉన్నాయని శశిధర్ రెడ్డి చెప్పారు. మన రాష్ట్రానికి ఇరువైపులా గోదావరి- కృష్ణా జీవ నదులు ఉన్నట్లే టర్కీకి కూడా నదులు ఉన్నాయన్నారు. టర్కీ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకున్నా మనకంటే ఎక్కువ కరవు ఉందన్నారు. ప్రాజెక్టులు అంటే కేవలం కాల్వలు నిర్మించడం కాదని ఆయన పోలవరం ప్రాజెక్టును ఉదహరించారు. గోదావరి నదీ జలాల వినియోగానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, మాటలు చెబితే సరిపోదన్నారు. దేవాదుల ఎత్తిపోతలకు విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారని, విద్యుదుత్పత్తి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నీటి భద్రత గురించి ఆలోచన చేయడం లేదన్నారు. గోదావరి జలాల వినియోగం, ప్రభుత్వ అసమగ్ర ప్రణాళిక గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని శశిధర్ రెడ్డి వివరించారు. మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ్మిడి హట్టి.. తట్టెడు మట్టి
ఎఫ్‌యుజిడబ్ల్యు కార్యదర్శి డి. నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి తీయలేదు కానీ 9 వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. 8 వేల మెగావాట్లు కేవలం ఎత్తిపోతలకే అవసరమైతే, ఆ విద్యుత్తు సోలార్, థర్మల్, హైడల్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకే తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదని విమర్శించారు. ఇఎస్‌సిఐ కన్సల్‌టెంట్ డాక్టర్ రాపోలు సైదులు మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు సంగతి దేవుడెరుగు కానీ ఉన్న వాటికి ముందు ఇవ్వాలన్నారు. తొలుత ఎఫ్‌యుడబ్ల్యుజె వ్యవస్థాపక కార్యదర్శి కె. పురుషోత్తం రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ నీటి సంరక్షణ గురించి వివరించారు. ఇంకా సమావేశంలో మర్రి చెన్నారెడ్డి స్మారక సంస్థ చైర్మన్ మర్రి రవీందర్ రెడ్డి, ‘స్మరణ్’ సంస్థ ప్రతినిధి వై. సుభాష్‌చంద్రారెడ్డి (బిఎస్‌ఎన్‌ఎల్), వివిధ సంస్ధల ప్రతినిధులు అవినాష్‌రెడ్డి, ఎవిజె సత్యం, మందడి శ్రావ్యా రెడ్డి, పశ్య పద్మ, అనంతరెడ్డి తదితరులు మాట్లాడారు. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి, టిపిసిసి నాయకులు జి. నిరంజన్, శ్యాంమోహన్ కూడా పాల్గొన్నారు.

చిత్రం గోదావరి నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న మర్రి శశిధర్ రెడ్డి