రాష్ట్రీయం

నేడే ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ ఎంసెట్ 2016కు ఉభయ రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయ. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు 2,46,522 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష హాలులోకి గంటముందు నుంచి అనుమతిస్తారని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈసారి జరిగే ఎంసెట్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. గతంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేవారు. మొట్టమొదటిసారి పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆందోళనకు దిగి ఎంసెట్ నిర్వహించేది లేదని ప్రకటించడంతో ఎంసెట్‌ను వాయిదా వేసిన ప్రభుత్వం, పట్టుదలతో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందితో, ప్రభుత్వ విద్యాలయాల్లోనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నాం 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో ఎంసెట్ పరీక్ష జరుగుతుంది. నీట్ పరీక్ష ద్వారానే వైద్య విద్యార్థులను చేర్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన పరిస్థితుల్లో జరుగుతున్న ఎంసెట్ పరీక్ష ఇది. ఒకవైపు విద్యార్థులు నీట్‌కు సిద్ధమవుతూనే మరోవైపు ఎంసెట్ రాసేందుకు సన్నద్ధమయ్యారు. ఎంసెట్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గంటముందే విద్యార్థులను పరీక్ష జరిగే చోటుకు అనుమతిస్తారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోనికెళ్లిన విద్యార్థిని పరీక్ష ముగిసేంత వరకు బయటకు వెళ్లడానికి అనుమతించరు. మూత్రానికి సైతం అనుమతించరని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు టాయిలెట్‌కు కూడా ముందే వెళ్లి రావాలని సూచించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎంసెట్‌కు ఆంధ్రలోనూ పరీక్షా కేంద్రాలున్నాయి. తిరుపతి, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సందర్భంగా తొలిసారిగా బయోమెట్రిక్ (వేలిముద్రలు) నమోదు విధానం ప్రవేశపెట్టారు.
ఆరు గంటలకు కోడ్ విడుదల
కూకట్‌పల్లి జెఎన్‌టియులో ఆదివారం ఉదయం ఆరుగంటలకు ఎంసెట్ 2016 సెట్ కోడ్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారు.