ఆంధ్రప్రదేశ్‌

‘పుష్పగిరి’ వివాదంపై విచారణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 14: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన పుష్పగిరి మఠం వివాదంపై విచారణ ప్రారంభమైంది. తిరుమలలోని పుష్పగిరి మఠం నిర్వాహకులు ఇద్దరు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకొని కోర్టుకెక్కిన నేపథ్యంలో విచారణ జరపాలంటూ న్యాయశాఖ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీకాళహస్తి ఇఓ భ్రమరాంబను విచారణ అధికారిగా నియమించిన విషయం విధితమే. గత వారం కడపలోని పుష్పగిరి పీఠంలో విచారణ జరిపిన ఆమె శనివారం ఉదయం తిరుమలలోని పుష్పగిరి మఠంలో విచారణ జరిపారు. కడపలోని పుష్పగిరి పీఠంలో చేపట్టిన విచారణలో 80 శాతం వరకు కీలకపత్రాలను, జమా ఖర్చుల పట్టికలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తిరుమలలోని పుష్పగిరి మఠంలో విచారణాధికారి భ్రమరాంబ మఠం నిర్వాహకుడు కొండలరావును, ఇతర ఉద్యోగులను విచారించారు. అయితే పుష్పగిరి మఠం మఠాధిపతి లేకపోవడం, కీలక పత్రాలు, జమా ఖర్చుల వివరాలు అందుబాటులో లేకపోవడంతో మఠం నిర్వాహకులు వచ్చేనెల 2వ తేదీ వరకు గడువు ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరగా విచారణాధికారి వారికి అనుమతి ఇచ్చారు. వచ్చేనెల 2వ తేదీన పత్రాలను, ఇతర వివరాలను అందజేయాలని విచారణాధికారి భ్రమరాంబ వారిని ఆదేశించారు. ఇదిలా ఉండగా తిరుమల పుష్పగిరి మఠంలో సింగరేణి సంస్థకు ఏడు గదులను లీజుకు ఇచ్చారన్న అంశంపై ఆమె మాట్లాడుతూ లీజు ధ్రువీకరణ పత్రాలను ఎవరో తమకు అందజేశారని, ఈ అంశంపై కూడా విచారణ జరుపుతామని తెలిపారు.