రాష్ట్రీయం

‘సాగర్’కు 4659 క్యూసెక్కుల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మే 14: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు శనివారం సాయంత్రం 4659 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 507.60 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 127.6327 టీఎంసీలకు సమానం. జంట నగరాలకు మంచి నీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాశయం నుండి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్ ఫ్లోగా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 778.40 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 19.7750 టీఎంసీలకు సమానం.