రాష్ట్రీయం

ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 14: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక చివరి అంకానికి చేరింది. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి తెరదింపి ప్రలోభాలతో ఓటర్లకు ఎరవేయడానికి ఉపక్రమించాయి. నాలుగు మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో గత 20రోజులు విస్తృత ప్రచారం చేసిన మంత్రులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా పార్టీల రాష్ట్ర, కేంద్ర నాయకులు గడువు ముగియడంతో జిల్లా వదిలి వెళ్ళారు. అయితే వారంతా గ్రామాల వారీగా తయారు చేసిన టీమ్‌లు ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అనేక చోట్ల అధికార పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకి మద్దతుగా డబ్బులు పంచుతుండగా ప్రత్యర్థులు పట్టుకున్నారు. కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో డబ్బు పంచుతున్న అధికార పార్టీ కార్యకర్తలను ఎస్‌ఐ అడ్డుకోగా ఆయనపై చెయ్యి చేసుకొని నిర్బంధించారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడిచేశారు. తిరుమలాయపాలెం మండలం యర్రగడ్డ గ్రామంలో డబ్బులు పంచుతున్న తెరాస నేతను సిపిఐ నేతలు కొట్టారు. రూరల్ మండలంలో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. మరికొన్ని గ్రామాల్లో ఇతర పార్టీల నేతలను చివరి క్షణంతో తమకు మద్దతిచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో సిపిఐ నేతలు తమ పార్టీ నిర్ణయం ప్రకారం సిపిఎంకు మద్దతునివ్వాల్సి ఉండగా తెరాస అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని చోట్ల నిన్నటి వరకు ఒక పార్టీకి ప్రచారం చేసిన నాయకులు ఒక్కసారిగా మరో పార్టీకి మద్దతుదారులుగా మారిపోయారు. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గంలో ఉన్న పాలేరులో నేతల పార్టీల మార్పిడికి కొందరు ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కొందరు అసంతృప్తిగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలను ఎదుర్కొనే ధైర్యం లేక నోరు మెదపడం లేదు.